సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డాక్యుమెంటరీ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారానికి సిద్ధమైంది.
మే 28 నుంచి ఈ డాక్యుమెంటరీ డిజిటల్ ప్రసారంలో అందుబాటులోకి ఉంది. మే 29 నుంచి తమిళంలోనూ ప్రసారం కానుంది. జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రవి భాగ్‌చంద్క, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ డాక్యుమెంటరీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2017లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సచిన్ టెండూల్కర్ క్రీడా జీవితాన్ని భావోద్వేగభరితంగా ఆవిష్కరించింది. ఇందులో సచిన్ చిన్ననాటి వీడియోలు, అరుదైన మ్యాచ్ దృశ్యాలతో పాటు ఆయన భార్య అంజలి టెండూల్కర్, సోదరుడు అజిత్ టెండూల్కర్ పంచుకున్న అనుభవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

