ప్రజాశక్తి -ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సుమారు 21 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని సిఐటియు నాయకులు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
మెడికల్ ఇన్స్యూరెన్స్ పెంపును వ్యతిరేకిస్తూ ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట విశ్రాంత స్టీల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.రామారావు మాట్లాడుతూ, స్టీల్ యాజమాన్యం మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచి విశ్రాంత ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదన్నారు. గతంలో ఒక్కొక్కరు రూ.1300 చెల్లించగా, ప్రస్తుతం రూ.8512కు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు.
ఈ సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకుని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాయకులు డి.ఆదినారాయణ, జె అయోధ్య రామ్, సంపూర్ణం మాట్లాడుతూ, స్టీల్ బోర్డు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. విశ్రాంత ఉద్యోగులకు నెలకు రూ.1000 నుండి రూ.3000 వరకు మాత్రమే పెన్షన్ వస్తోందని, ఇంత భారీ ప్రీమియం చెల్లించడం కష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.కృష్ణారావు, వైటి.దాస్, పెద్దిరాజు, శివరాం, టి.చిరంజీవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

