ప్రజాశక్తి-శంఖవరం : అన్నవరం సత్య దేవుని సన్నిధికి విచ్చేసే యాత్రికుల మౌలిక సదుపాయాల సంబంధించి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఈనెల 12వ తేదీన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
కొండపైన 11.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టే సీతారామ సత్రం 105 రూములతో కూడిన జి ప్లస్ త్రీ ఫస్ట్ బ్లాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా కొత్త టోల్గేట్ వద్ద 1. 30 కోట్లతో నిర్మించిన నూతన మెట్ట మార్గానికి ప్రారంభోత్సవం చేస్తారని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ ప్రజాశక్తికి తెలిపారు.

