Dailyhunt
పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

బెల్లంపూడి గ్రామంలో పలు సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యులు

ప్రజాశక్తి - పి.గన్నవరం

బెల్లంపూడి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధుల రూ.26 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణాలకు సర్పంచ్‌ బండి మహాలక్ష్మి పాలకవర్గ సభ్యులతో కలసి శంకుస్థాపనలు చేశారు.

బండి హనుమంతురావు ఇంటి నుంచి జగతా చింతామణి ఇంటివరకు రూ.3 లక్షలు, కోండ్రు ఇమ్మానుయేలు ఇంటి నుంచి కోండ్రు పరమానందం ఇంటి వరకు రూ.6 లక్షలు, మెల్లం వెంకటేశ్వరరావు ఇంటి నుంచి నక్కా ధనలక్ష్మి ఇంటి వరకు రూ.6 లక్షలు, దిగుమర్తి శ్రీనివాస్‌ ఇంటి నుండి చర్చి చివర వరకూ రూ.9 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మహాలక్ష్మి మాట్లాడుతూ సిసి రోడ్లు నిర్మాణ పనులకు ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ వెంటనే ప్రారంభించి పూర్తిచేస్తారని తెలిపారు. మొదటి విడతలో సిసి రోడ్లు నిర్మాణానికి తక్కువ నిధులు మంజూరు చేశారని, రెండో విడతలో ఎక్కువ నిధులు మంజూరు చేయాలని గత సంవత్సరం కలెక్టర్‌కు, ఎంజిఎన్‌ఆర్‌జిఎస్‌ పీడీ, పంచాయితీ రాజ్‌ ఉన్నతాధికారులకు విన్నవించామన్నారు. రెండో విడతలో కలెక్టర్‌ రూ.26 లక్షలు నిధులు సిసి రోడ్లు నిర్మాణానికి పూర్తి నిధులు మంజూరు చేశారని సర్పంచ్‌ తెలిపారు. పంచాయతీ రాజ్‌ ఇంజినీర్స్‌ విభాగం అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇవ్వడంతో సర్పంచ్‌ మహాలక్ష్మి సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పితాని రామలక్ష్మి, గ్రామ పెద్దలు చీకరమెల్లి నాగరాజు, బండి శ్రీనివాసరావు, బండి గోవిందరావు, పితాని స్వామి, దిగుమర్తి శ్రీనివాస్‌, దిగుమర్తి నాగరాజు, దిగుమర్తి పెద్ద బ్బులు, మాతా నాగభూషణం, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti