కుందాం
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు : ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్లే కరోనా మహమ్మారి విజృంభిస్తుందని పలాస-కాశీబుగ్గకు చెందిన గ్రీన్ ఆర్మీ సభ్యులు ఉద్ఘాటించారు. గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్ నేతృత్వంలో మండలంలోని వెంకటాపురం ప్రాథమిక వైద్యాధికారి జోగి గౌతమ్ తదితరుల బృందం ఉద్ధాన, తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. పర్యావరణంపై పలువురుకి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మొక్కలు విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ సభ్యులు జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అసపాన మధు, బత్తిన ఓంకార్, బోకర దుర్యోధన, అంబటి కృష్ణ, నూకల హేమసుందర్, నాగేష్, శంకర్, బందాపు తిరుమల తదితరులు పాల్గొన్నారు.
కవిటి: పచ్చని చెట్లే ప్రకృతికి అందమని, విరివిగా మొక్కలు నాటడంతో మన ధరిత్రీని మనం రక్షించుకోవాలని ఎస్‌ఐ జి.అప్పారావు అన్నారు. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మండలంలోని జగతిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు ముఖ్యపాత్ర వహిస్తాయని అన్నారు. పచ్చని ప్రకృతి పదికాలాలు ధరిత్రిని కాపాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ పూడి వరప్రసాద్, మాజీ సర్పంచ్ నేతాజీ, విఆర్‌ఒ వజ్జ గిరిబాబు, రవి పాల్గొన్నారు.
టెక్కలి : పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ ప్రకృ తి మనకిచ్చిన వనరులను మనం కాపాడుకోవాలని టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తెంబూరు గోవిందమ్మ ఆన్నారు. స్దానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా శుభ్రం చేయించారు. కార్యక్రమంలో రెండో జాతీయ సేవా విభాగం పిఒ డాక్టర్ బి.విజయేశ్వరరావు, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

