Friday, 18 Oct, 11.12 am ప్రజాశక్తి

అనంతపురం
పెడబల్లిలో నలుగురు అరెస్టు

ప్రజాశక్తి-కొత్తచెరువు
పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో సిఐ బాలసుబ్రమణ్యంరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. పుట్టపర్తి మండల పరిధిలోని పెడబల్లి గ్రామానికి చెందిన ఆకుల గణేష్‌, వడ్డె నాగరాజు, వడ్డె లకిëపతి, సున్నపురాళ్ల పృద్దీరాజ్‌లు మిత్రులు. వీరు చెడు వ్యసనాలకు బానిసలై, పెడబల్లి పరిసర గ్రామ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండేవారు. వీరిలో ఆకుల గణేష్‌ మదనపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తన అన్న పవనకుమార్‌ను చంపిన హత్యకేసు, టెలిఫోన్‌ చోరీ చేసులో నిందితుడు. 15రోజుల క్రితం గణేష్‌ పెడబల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డి కారు డ్రైవర్‌ భాస్కర్‌రెడ్డికి ఫోన్‌ చేసి తాను నాగరాజును త్వరలో చంపుతానని చెప్పాడు. వారం రోజుల క్రితం గణేష్‌ తాను వాడిన సెల్‌ఫోన్‌ను తన స్నేహితుడైన పృద్విరాజ్‌కు అమ్మాడు. సెల్‌ తీసుకున్న పృద్దీరాజ్‌ అందులోని కాల్‌రికార్డును వినగా గణేష్‌ నాగరాజును హత్య చేసే విషయాన్ని తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని పృద్విరాజ్‌ నాగరాజుకు చెప్పి, సెల్‌ సందేశాన్ని అంతనికీ పంపాడు.

ఇదే సంభాషణను నాగారాజు అతని స్నేహితుడైన లకిëపతితో కలిసి పెడబల్లి గ్రామంలో కొంతమందికి షేర్‌ చేశాడు. ఈ హత్యకు సంబంధించిన ఫోన్‌ సంభాషణపై గ్రామంలో పెద్దఎత్తున చర్చజరిగి పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు దీనిపై ఆరా తీశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కక్షలు రేపేలా సెల్‌ సందేశాలను అందరికీ పంపి భయభ్రాంతులకు గురి చేసిన నలుగురు వ్యక్తులు గణేష్‌, నాగరాజు, పృద్విరాజ్‌, లక్ష్మిపతిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా ఉంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top