Dailyhunt
పెంపుడు జంతువులు జాగ్రత్త!

పెంపుడు జంతువులు జాగ్రత్త!

వేసవి ఉష్ణోగ్రతలకు మనుషులతోపాటు జంతువులు కూడా ప్రభావితం అవుతాయి. వడదెబ్బ తగిలినప్పుడు కుక్కలలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. సాధారణం కంటే వేగంగా, ఆపకుండా గాలి పీల్చుకుంటాయి.

వాటి చిగుళ్లు ముదురు ఎరుపు, నీలం, ఊదా రంగులోకి మారుతాయి. నోటి నుంచి విపరీతంగా లాలాజలం కారుతుంది. ఎక్కువ వడదెబ్బకు గురైన కుక్కలు నడవలేకపోతాయి కూడా. ఒకేచోట పడిపోయి ఉంటాయి. కొన్నిసార్లు రక్తంతో కూడిన విరేచనాలు కూడా చేసుకుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. కుక్కకు వడదెబ్బ సోకిందని గుర్తించవచ్చు.

ప్రథమ చికిత్సతో మేలు..

కుక్కకు వడదెబ్బ తగిలిందని గమనించిన వెంటనే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కుక్కల్ని చల్లని ప్రదేశానికి మార్చాలి. ఏసీ /ఫ్యాన్‌ ఉన్న గదిలోకి తీసుకెళ్లాలి. గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని కుక్కపై పోయాలి. తల, మెడ, పొట్ట భాగం, కాళ్ల కింద తడి గుడ్డతో తుడవాలి. నీళ్లు మరీ చల్లగా (ఐస్‌ వాటర్‌) లేకుండా చూసుకోవాలి. లేకుంటే రక్తనాళాలు కుంచించుకుపోయి, వేడి బయటికి పోకుండా ఉంటుంది. కుక్క స్పృహలోకి వస్తే.. కొంచెం కొంచెంగా నీరు తాగించాలి.
కుక్కలకు పాదాల అడుగు భాగం నుంచే వేడి త్వరగా బయటికి పోతుంది. కాబట్టి వాటిని బాగా తుడవాలి. ప్రథమ చికిత్సతో కుక్క కాస్త కోలుకోగానే.. పశువైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే వడదెబ్బ వల్ల కిడ్నీలు, కాలేయం లాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కాబట్టి, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti