- కాంట్రాక్టర్ ప్రసాద్ సంస్మరణ సభలో పలువురు వక్తలు
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
కాంట్రాక్టర్స్‌కు ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోషియేషన్ కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఎన్.అప్పారావు, ఎంఆర్‌డి ప్రసాదరావు డిమాండ్ చేశారు. బెంజిసర్కిల్ వద్ద గల అసోసియేషన్ కార్యాలయంలో శనివారం విస్సన్నపేటకు చెందిన కాంట్రాక్టర్ ఎ.ప్రసాద్ సంతాప సభ జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పనులకు నుండి పెద్ద సంఖ్యలో బిల్లులు రావాల్సి ఉందని బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో ప్రసాద్ మరణించడం బాధాకరమన్నారు.
ఇలా ఎంతో మంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనులకు సంబంధించి బిల్లులు పెద్ద ఎత్తున రావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ప్రసాద్‌కు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం అందించి కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు ఇతర కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సత్వరమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోటిరెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరాజు, అడ్వైజర్స్ సాయి,శ్రీనివాసరావు, రామమోహన్, సభ్యులు జయరాం, సుధీర్ పాల్గొన్నారు.

