Saturday, 09 Nov, 9.41 pm ప్రజాశక్తి

తాజావార్తలు
పెనుమూరులో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రాజా ఇండ్లు మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు శ్రీను (35), అతని కుమారుడు (8), కుమార్తె (9) వీరు తిరుపతిలోని జీవకోన వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top