Tuesday, 22 Oct, 12.15 am ప్రజాశక్తి

తాజావార్తలు
పిఎం-కిసాన్‌ పథకం అమలుకు ఆప్‌ సర్కార్‌ ఆమోదం

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు మరో పథకాన్ని ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి (పిఎం-కిసాన్‌)ను అమలు చేయాలని నిర్ణయిం చింది. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతు రూ.6వేల ఆదాయ మద్దతును పొందనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రారంభిం చిన ఈ పథకం కింద కేంద్రం మూడు సమాన వాయిదాల్లో రూ. 6వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీంతో సుమారు 7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. అయితే గతంలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించాయి. కాగా, ఇటీవల 11 వేలమంది రైతుల పేర్లతో కూడి న జాబితాను కేంద్రానికి పంపామని వ్యయసాయ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ అగర్వాల్‌ పేర్కొన్నారు. మొదటి విడతగా 7 కోట్ల మంది రైతులకు రూ. 32 వేల కోట్లు విడుదలయ్యాయని, రెండో విడత 5.6 కోట్లమంది లబ్ధిదారులకు, మూడవ విడత 3.2 కోట్లమంది లబ్దిదారులకు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top