Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొదలకుంట్లపల్లెలో ఎడ్ల పోటీలు

పొదలకుంట్లపల్లెలో ఎడ్ల పోటీలు

ప్రజాశక్తి-గిద్దలూరు: మండలంలోని పొదలకుంట్లపల్లె శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎడ్లపోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన పాలగిరి సుధాకర్‌రెడ్డి ఎడ్ల జత 3000 అడుగులు లాగి ప్రధమ స్థానంలో నిలిచాయి. పోలెపల్లె గ్రామానికి చెందిన బెజవాడ అనూష ఎడ్ల జత 2506.4అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా తెల్లపాడు గ్రామానికి చెందిన ఒట్టెపోగు జయన్న ఎడ్ల జతల 2502.7అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా ఎర్రగుంట్లపాడు గ్రామానికి చెందిన కళ్ళెం లకీëచైతన్య ఎడ్ల జత 2382.5అడుగులు లాగి 4వ స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా ఎన్‌.కొత్తపల్లె, సుబ్బారెడ్డి పాలెం గ్రామాలకు చెందిన అల్లం బూనసాయి, కంబైండ్‌ విష్ణుల ఎడ్ల జత 2378.5 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఈ బహుమతులను దేవస్థానం కమిటి ఆధ్వర్యంలో మాజీ ఎంపిపి కడప వంశీధర్‌రెడ్డి, కడప మురళీమోహన్‌రెడ్డిలు పంపిణీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti