Dailyhunt
పోలీసు కానిస్టేబుల్ పై దాడి !

పోలీసు కానిస్టేబుల్ పై దాడి !

ప్రజాశక్తి-కార్వేటినగరం : కార్వేటినగరం మండలానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ యుగంధర్ పై కొందరు అక్రమ వ్యాపారులు దారి కాచి దాడి చేసినట్టు తెలిసింది.

కార్వేటినగరం నుంచి నిత్యం కొందరు గ్రావెల్, ఇసుక, కలప అక్రమ రవాణా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ అక్రమాలకు ఆయన అడ్డుపడుతున్నారన్న కక్షతో ఈ దారుణానికి ఒడికట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారు ఉదయం ఆయన తన భార్యను స్కూల్ వద్ద దింపి తిరిగి స్కూటర్ పై ఒంటరిగా వస్తున్న సమయంలో కొందరు అతన్ని అడ్డగించి కొట్టి గాయపరచినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థానికి వెళ్లి అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారని తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti