Dailyhunt
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ఇంటర్నెట్ : కేరళం, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభించారు. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నంలోగానే ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కౌంటింగ్ హాల్ లోకి మొబైల్స్ ను అనుమతించడం లేదు.
కేరళంలో మొత్తం 140సీట్లు ఉండగా 71 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. తమిళనాడులో 234సీట్లు ఉండగా విజయానికి 118 సీట్లు అవసరం కాగా, పశ్చిమ బెంగాల్‌ లో మొత్తం 294సీట్లు ఉండగా, ప్రస్తుతం 293 సీట్లకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 148 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అస్సాంలో మొత్తం 126సీట్లు ఉండగా విజయానికి 64 సీట్లు అవసరం అవుతాయి. పుదుచ్చేరిలో మొత్తం 30సీట్లు ఉండగా 16సీట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో గెలిచిన అభ్యర్థులను రిసార్ట్ కు తరలించే యోచనలో పలు పార్టీలు ఉన్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti