ప్రజాశక్తి -గోపాలపట్నం : నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. జివిఎంసి 89, 90, 91, 92 వార్డుల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అన్ని శాఖల అధికారులతో గోపాలపట్నంలోని పిన్నమనేని హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ కె.హేమావతి, ఎస్‌ఇ ప్రవీణ్ కుమార్, ఇఇ ప్రసన్న, ఎఇ ఇపిడి చిరంజీవి, కూటమి నాయకులు అంగ ప్రశాంతి, బొడ్డేటి విజరు, దాడి రమేష్, బొమ్మిది రమణ, ఎలమంచిలి ప్రసాద్, సరగడం అరుణ్, నరవ అనూష, నారిపిన్ని సత్తిరాజు, కంపరం ఆనంద్, దాడి రమేష్ నాయుడు, నాదెళ్ల జ్యోతి పాల్గొన్నారు.

