Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలకు తోడుగా ఉండండి

ప్రజలకు తోడుగా ఉండండి

కడప కరోనా కష్ట కాలంలో తగు జాగ్రత్తలతో ప్రజలకు తోడుగా ఉండాలని కాంగ్రెస్‌ శ్రేణులకు గురువారం నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్‌ సూచించారు. జిల్లా నుంచి జూమ మీటింగ్‌లో కడప జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు,నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డిలు పాల్గొన్నారు. జిఒ నెంబరు 77ను రద్దు చేయాలని, పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఉచితంగా కరోనా వాక్సిన్‌ అందించాలని, కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.6వేలు ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు జూమ్‌ మీటింగ్‌టో ప్రభుత్వాన్ని కోరారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిత్యావసరాలు, ఎరువులు, కూరగాయలు, పండ్లు, సిమెంట్‌, స్టీలు, ఇసుక, పప్పుగింజలు, నూనె తతితరాల ధరలను అదుపులో ఉంచాలన్నారు.

కరోనా తీవ్రరూపం దాల్చుతోందని, ప్రభుత్వం వాక్సిన్‌ కొరత, బెడ్ల కొరత లేకుండా చూడాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti