Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రముఖ కళాకారుడు సతీష్‌ గుజ్రాల్‌ కన్నుమూత..

ప్రముఖ కళాకారుడు సతీష్‌ గుజ్రాల్‌ కన్నుమూత..

ఢిల్లీ : పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ కళాకారుడు సతీష్‌ గుజ్రాల్‌ (94) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యం కారణంగా సతీష్‌ గుజ్రాల్‌ ఢిల్లీలో గడిచిన (గురువారం) రాత్రి మరణించారు. సతీష్‌ గుజ్రాల్‌ మఅతిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ సోదరుడైన సతీష్‌ గుజ్రాల్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. రచన, వాస్తు శిల్పం, మురళీ వాయిద్యం, పెయింటింగ్‌, గ్రాఫిక్‌ ఆర్టిస్టుగా తన సఅజనాత్మకతతో విశేష అభిమానం సంపాదించారు. ఆటో బయోగ్రఫీతో సహా నాలుగు పుస్తకాలను పబ్లిష్‌ చేశారు. సతీష్‌ గుజ్రాల్‌ వర్క్స్‌పై డజన్ల సంఖ్యలో డాక్యుమెంటరీలు రూపొందాయి. అతని జీవితంపై ఫీచర్‌ ఫిలిం రూపొందుతున్నట్లు సతీష్‌కు చెందిన వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti