Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionచేనేతలకు సకాలంలో ఆప్కో చెల్లింపులు : మంత్రి సవిత

Print Editionచేనేతలకు సకాలంలో ఆప్కో చెల్లింపులు : మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు సంబంధించి చేనేత కార్మికులకు 2024 ఏప్రిల్ నుంచి ప్రతీనెలా చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

ఇప్పటి రూ.24.51 కోట్లను చెల్లించి, చేనేత సంఘాలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లలోను చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో అధికారులు రు. 18.03 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశారని, ఇందుకు రూ.18.02 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి వరకూ రూ.6.61 కోట్ల వస్త్రాలను చేనేత సంఘాల నుంచి కొనుగోలు చేయగా, పూర్తి స్థాయిలో ఆ సంఘాలకు చెల్లింపులు చేశారు. చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678 లను మంగళవారం చెల్లించారని, వివిధ శాఖలు, గురుకులాల పాఠశాలలకు సరఫరా చేసిన చేనేత లివరీ వస్త్రాలకు సంబంధించి ఈ చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. 20 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆ చెల్లింపులను జమ చేయగా, త్వరలో మిగిలిన బకాయిలను కూడా చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టారన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti