పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : మెగా డిఎస్‌సి-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో (పిల్) ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అదనపు ఆధారాలుగా సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన అభ్యర్థులను ఈ వ్యాజ్యంలో పక్షాలుగా చేర్చే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డిఎస్‌సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసిపి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిగింది.

