Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionఎంఎస్‌ఎంఇల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యం

Print Editionఎంఎస్‌ఎంఇల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యం

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

దక్షిణ భారత ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 116వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. దక్షిణ భారతదేశంలో వ్యాపార, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలను, యువతను ప్రోత్సహించడం ద్వారానే సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక పార్కులు, ఉమ్మడి వసతులు, ఆర్థిక సాయంతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఇలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ఇండియా-ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎన్ఆర్ఐ వర్గాల సహకారంతో స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఎస్‌ఐసిసిఐ అధ్యక్షులు అరుణ్ అలగప్పన్ మాట్లాడుతూ.. 2047 నాటి భారత వికాస లక్ష్యాలు చిన్న తరహా పరిశ్రమల ప్రగతిపైనే ఆధారపడి ఉన్నాయని, తమిళనాడు సాధించాలనుకుంటున్న ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో చిన్న పరిశ్రమలే కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మద్రాస్ యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, లయోలా ఇన్‌స్టిట్యూట్, త్యాగరాజ కాలేజ్, భారతిదాసన్ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti