Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionజగన్‌ ఇంటి ముందు బోరుగడ్డ నిరసన

Print Editionజగన్‌ ఇంటి ముందు బోరుగడ్డ నిరసన

  • కార్యాలయంలోకి రావొద్దన్నారని ఆగ్రహం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ తదితర నాయకులపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన బోరుగడ్డ అనిల్‌ మంగళవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయం ముందు తన భార్యతో కలిసి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

సజ్జల తన వెంట్రుకతో సమానమంటూ దూషణలకు దిగారు. గతంలో తనను బాగానే చూసుకున్నారని, కేసుల్లో ఇరుక్కున్న తరువాత పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. మంగళవారం ఉదయం బోరుగడ్డ అనిల్‌, ఆయన భార్య తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయం ముందు నిరసనకు దిగారు. దీనిపై అనిల్‌ మాట్లాడుతూ.. తనను కార్యాలయంలోకి రావొద్దంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై 22 కేసులు పెట్టిందని న్యాయవాదిని పెడతామని పిలిపించారని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తరువాత సజ్జల కనీసం మాట్లాడలేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నారని, పది నెలలు జైల్లో ఉన్నానన్నారు. ఇప్పుడు కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. దీనిపై ఎంతవరకైనా తాను వెళతానన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti