Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionనాసిరకం ఆహారంపై ఎయు విద్యార్థుల ఆందోళన

Print Editionనాసిరకం ఆహారంపై ఎయు విద్యార్థుల ఆందోళన

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ బాయ్స్ హాస్టల్‌లో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు.

మెస్‌లో వడ్డించిన కోడిగుడ్డు కూర నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లిపోయిన టమాటాలు, నాసిరకం కూరగాయలతో వంటలు తయారు చేస్తున్నారంటూ వడ్డించిన ఆహారాన్ని తీసుకుని వర్సిటీ విసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రా యూనివర్సిటీ ఉపాధ్యక్షులు తరుణ్ నాయకత్వం వహించారు. ప్రతి నెలా మెస్ ఛార్జీలు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై గత వారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. విద్యార్థుల నిరసనతో ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని గమనించారు. నాసిరకం ఆహారం తయారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపై పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్ మాట్లాడుతూ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti