Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionపొగాకు రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?

Print Editionపొగాకు రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?

  • మంత్రి కె అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొగాకు రైతుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

విజయవాడలోని హోటల్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి, సుమారు రూ.280 కోట్లు వెచ్చించామన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పలు చారిత్రక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బీమా పరిహారాలను పూర్తిగా చెల్లించడంతో పాటు, మత్స్యకారుల బీమా పథకాన్ని విస్తరించడం, విద్యుత్ సబ్సిడీ పెంపు, వేట నిషేధ కాల భృతిని పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా వేట నిషేధ కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మత్స్యకారుల బీమా పథకాన్ని రూ.6.76 కోట్లతో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti