Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionసమిష్టి కృషితో దోషరహిత ఓటర్ల జాబితా

Print Editionసమిష్టి కృషితో దోషరహిత ఓటర్ల జాబితా

  • సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ లోపాలకు తావులేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సమష్టి కృషి అవసరమని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్‌ పవన్ కుమార్ శర్మ అన్నారు.గురువారం ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్ ఎవిఎస్‌ రెడ్డి హాల్‌లో రాష్ట్రంలోఎస్‌ఐఆర్‌ పురోగతిపై ఆయన సమీక్షా, చర్చ కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 43,71,397 నోటీసుల పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ, మిగిలిన జిల్లాలోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నోటీసులపై విచారణకు సంబంధించి ప్రస్తుతానికి అత్యల్పంగా 15.18 శాతం మాత్రమే పెండింగ్ ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలు, బిఎల్‌ఎలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమని చెప్పారు. ఈ సమావేశానికి ఎపి సిఇఒ వివేక్ యాదవ్‌, అదనపు సిఇఒ ఎస్‌ డిల్లీరావు, వివిధ జిల్లాలో కలెక్టర్లు జి లక్ష్మీశ, సిఎం సాయికాంత్ వర్మ, కృతికా శుక్లా, కీర్తి చేకూరి, చదలవాడ నాగరాణి, కె.వెట్రిసెల్వి, వి వినోద్ కుమార్, ఆయా జిల్లాల ఇఆర్‌ఒలు ప్రత్యక్షంగా హాజరుకాగా వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti