Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionస్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడితే ఎదుర్కోవాలి

Print Editionస్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడితే ఎదుర్కోవాలి

  • వైసిపి శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌

ప్రజాశక్తి - పులివెందుల టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలని, అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే గట్టిగా ఎదుర్కోవాలని వైసిపి నాయకులు, కార్యకర్తలతో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకున్న ఆయనకు వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆయనను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

వారి సమస్యలను విన్న జగన్‌, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని, పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, సుధా, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti