Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionస్వల్పంగా పెరిగిన గోదావరి వరద

Print Editionస్వల్పంగా పెరిగిన గోదావరి వరద

  • కాటన్‌ బ్యారేజీ వద్ద 10.90 అడుగులకు నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 33 అడుగులకు చేరిన గోదావరి

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి నదికి ఎట్టకేలకు రెండోసారి వరద కళ వచ్చింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా వరదనీరు చేరుతోంది. ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద గురువారం 10.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 4.78 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. సాగునీటి అవసరాల కోసం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ 33 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాధారణంగా గోదావరికి జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు రావడం పరిపాటి. అయితే ఈ ఏడాది ఆగస్టు చివరి దశకు చేరుకున్నా ఆశించిన స్థాయిలో వరదలు లేకపోవడంతో డెల్టా రైతులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద నీరు చేరుతోంది. గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో డెల్టా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు పరిధిలో పంటలకు ప్రయోజనం కలగనుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti