ప్రజాశక్తి - జీలుగుమిల్లి :అటవీ శాఖాధికారులు పెద్ద పులిని పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఐదు రోజులుగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులిని సురక్షితంగా పట్టేందుకు అటవీ అధికారులు మొత్తం కదిలొచ్చి చేస్తున్నా ఎటువంటి లాభమూ లేకుండా పోయింది.
ట్రాకర్ ద్వారా పులి కదలికలను గమనిస్తూ దానికనుగుణంగా చెట్టుపై నుంచే వలలు ఏర్పాటు చేసి పైన ఒక షూటర్‌ను పెట్టి, కింద ఒక దూడను కట్టేసి ఉంచారు. అయితే పెద్దపులి అటువైపు రాకుండా సిర్రివారిగూడెం వైపు వెళ్లి గ్రామ శివారు మడుగులో మకాం వేయడంతో అధికారులు కంగుతిన్నారు.

