Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Print Editionవైసిపిలో చేరిన గూడపాటి

Print Editionవైసిపిలో చేరిన గూడపాటి

  • ఆహ్వానించిన జగన్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రేపల్లె నియోజకవర్గం టిడిపి నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు.. వైసిపి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో మంగళవారం వైసిపిలో చేరారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు గూడపాటి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు జగన్‌ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. గూడపాటి శ్రీనివాసరావుతో పాటు వైసిపిలో చేరిన ప్రతి ఒక్కరినీ వైసిపి ఆదరిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో మోహన్‌ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. జిఎస్‌ రాకతో, రేపల్లెలో మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగ నాగార్జున, ఎంపి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపి నందిగం సురేష్, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి పి నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti