Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు : గెలుపు దిశగా ఎన్‌డిఎ కూటమి

పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు : గెలుపు దిశగా ఎన్‌డిఎ కూటమి

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్‌డిఎ కూటమి గెలుపు దిశగా ఉంది. ఎన్‌డిఎ కూటమిలో ఆల్‌ ఇండియా ఆల్‌ ఇండియా ఎన్‌.ఆర్‌.సి (ఎఐఎన్‌ఆర్‌సి), భారతీయ జనతా పార్టీలు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

ఇక ప్రతిపక్ష కూటమిలో డిఎంకె, కాంగ్రెస్‌, విదుతలై చిరుతైగల్ కట్చి (విసికె), పట్టాలి మక్కల్ కచ్చి (పిఎంకె), ఇతర వామపక్ష పార్టీలు పోటీలో నిలిచాయి. ఇక తమిళ హీరో విజయ్‌ స్థాపించిన టివికె, నేయం మక్కల్ కజగం (ఎన్‌ఎంకె)తో కలిసి పోటీ చేసింది.

​ఎఐఎన్‌ఆర్‌సి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్. రంగస్వామి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు బిజెపి పొత్తుతో ఐదోసారి ముఖ్యమంత్రి కానున్నారు.

ఈ రాష్ట్రంలో గెలిచిన నియోజకవర్గాల వారీగా..

1. తట్టంచవాడి- ఎన్.రంగసామి

2. మన్నాడిపేట- ఎ.నమశ్శివాయం

3. నెల్లితోప్- వి. కార్టిగుయానే

4. అరియాంకుప్పం- సి.అయ్యప్పన్ అలియాస్ మౌత్తయప్పన్

5. ఎంబాలం- ఇ. మోహన్‌దాస్

6. కారైకల్ నార్త్- పి.ఆర్.ఎన్. తిరుమురుగన్

7. లాస్‌పేట్- వి.పి. శివకొలుందు

8. విలియనూర్- బి. రవికౌమర్

9. ముత్యాలపేట- వైయాపురి మణికందన్

10. నెట్టపాక్కం- పి.రాజవేలు

11. యానాం- మల్లాది కృష్ణారావు

12. నెరవి-టి.ఆర్. పట్టినం- TKSM మీనచ్చిసుందరం13.

13. ఊసుడు- పి. కార్తికేయన్1

14. ఊపాలం- ఎ. అన్బళగన్1

15. మహే- అడ్వ. టి. అశోక్ కుమార్

16. కదిర్గామం- అజగు అలియాస్ అజ్ఘానంతం

17. నెడుంగడు- డా.వి.విఘ్నేశ్వరన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti