Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పులివెందులలో వైఎస్‌ జగన్ పర్యటన

పులివెందులలో వైఎస్‌ జగన్ పర్యటన

మరావతి : వైసిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. నేడు, రేపు పులివెందులలో పర్యటించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్‌ జగన్‌ పులివెందులకు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద వైఎస్‌ జగన్‌కు వైసిపి నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈరోజు రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti