Dailyhunt
పుస్తకం

పుస్తకం

పుస్తకం ఉంటే ధైర్యం చదివితే జీవితం సుగమం
ప్రతి కమ్మ చదివితే
అగుపించును అమ్మ రూపం

పుస్తకం మలినాన్ని కడిగేస్తది
మనిషితనాన్ని గుర్తుచేస్తది
ప్రపంచ చరిత్ర పుస్తకమే

సమస్త పోరాటం అక్షరమే!

పుస్తకం ఆలోచన కలిగిస్తది
ధైర్యాన్ని నూరిపోస్తది
పుస్తకం తాకితే మాట్లాడినట్లు
పిల్లలతో కలిసి తిరుగుతున్నట్లు
ఎప్పుడూ అనిపిస్తది!

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti