విజేతలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందన
ప్రజాశక్తి కర్నూలు క్రైం : ఆంధ్రప్రదేశ్ శాప్ లీగ్ మాస్టర్స్ క్రీడలలో పాల్గొని బంగారు, వెండి, కాంస్యం పతకాలు సాధించిన ఆర్ ఎస్సై, కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సీటిలో మార్చి 30, 31 తేదిలలో 35 నుండి 45 ఏళ్ళ వయస్సు విభాగంలో ఈ రాష్ట్ర స్ధాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటిలలో ఆర్ ఎస్సై పి.ఆర్ మహేశ్వరెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్ లు పతకాలు సాధించారు. ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విజేతలైన పోలీసు క్రీడాకారులు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసు విధులలో ఒత్తిడితో ఉంటూ క్రీడలలో కూడా రాణించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలలో రాణించాలని జిల్లా ఎస్పీవిక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు.
ఆర్ ఎస్సై పి.ఆర్ మహేశ్వర రెడ్డి గుంటూరు ఆచార్యయూనివర్సీటిలో 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించారు. గత 5 సంవత్సరాలుగా మాస్టర్స్ అథ్లెటిక్స్ లలో పాల్గొంటూ , చెన్నై నేషనల్ మీట్ లలో కూడా ప్రతిభ చూపారు. కానిస్టేబుల్ శివకుమార్ ..(కర్నూలు ట్రాఫిక్ పియస్) గుంటూరు ఆచార్య యూనివర్సీటీలో లాంగ్ జంప్ లో క్యాంస పతకం సాధించారు. గతంలో సౌత్ జోన్ నేషనల్స్, కేరళ జూనియర్స్ నేషనల్ , రాష్ట్ర మరియు జిల్లా స్ధాయి లాంగ్ జంప్ పోటీలలో కూడ ప్రతిభ చూపారు. వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడలలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆర్ ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, సెక్రటరీ రవికుమార్ ఉన్నారు.

