ప్రజాశక్తి - చిప్పగిరి : ప్రభుత్వం కల్పించే రాయితీ పనిముట్లను రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీరామ్ ప్రవీణ్ తెలిపారు.
గురువారం చిప్పగిరి లోని రైతు సేవా కార్యాలయంలో ఏవో మాట్లాడారు. మండలంలోని చిన్న కారు రైతులు, మహిళా రైతులకు 50% రాయితీతో పనిముట్లు ను ప్రభుత్వం అందజేయుటకు సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటి గా మార్చడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. పనిముట్లు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశమును ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు చిప్పగిరిలోని రైతు సేవ కార్యాలయమునకు వెళ్లి వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఏఈఓ రమాదేవి, అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

