Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైలు ఢీకొని వృద్ధుడు మృతి

రైలు ఢీకొని వృద్ధుడు మృతి

ప్రజాశక్తి - తెనాలి రూరల్ (గుంటూరు) : తెనాలి రైల్వే పరిధిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేమూరు రేపల్లె మార్గంలో ప్యాసంజరు రైలు ఢీకొనడంతో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని అదే రైలులో రేపల్లెకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రి శవాగారంలో ఉంచారు. సమాచారం అందుకున్న తెనాలి జిఆర్పి ఎస్సై సరస్వతి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతుడు పెనుమర్రు లేదా వేమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావచ్చని, అతని వయస్సు సుమారు 60 నుంచి 62 సంవత్సరాల మధ్య ఉండవచ్చన్నారు. ఈ ఘటనపై ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సరస్వతి వెల్లడించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti