Dailyhunt
రైల్వే స్టేషన్‌ మాస్టార్ల ధర్నా

రైల్వే స్టేషన్‌ మాస్టార్ల ధర్నా

విశాఖ రూరల్‌ :సమస్యలు పరిష్కరించాలని ఆలిండియా స్టేషన్‌ మాస్టర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన డిఆర్‌ఎం కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్తేర్‌ డివిజన్‌ జనరల్‌ సెక్రటరీ పిఎన్‌,మూర్తి మాట్లాడుతూ, స్టేషన్‌ మాస్టర్లందరికీ నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ కొనసాగించాలని కోరారు. రైళ్ల రాకపోకల నియంత్రణలో కీలక భూమిక పోషిస్తున్న స్టేషన్‌ మాస్టర్‌కు నైట్‌ డ్యూటీ అలవెన్సును రద్దు చేయడం అన్యాయమన్నారు. రూ.43,600 బేసిక్‌ను పరిధిలోకి తీసుకుని అలవెన్స్‌ రద్దు చేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలవెన్స్‌ మంజూరుచేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఎంకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో విఎస్‌.రావు, ఎస్‌కె.కేసరి, కాళీప్రసాద్‌, పి.భాస్కర్‌, ఎ.అరుణశ్రీ, సిహెచ్‌.రత్నాకరరావు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti