Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rains - తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

Rains - తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

మరావతి : తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీర ప్రాంతము, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన నిన్నటి సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం సోమవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోంది.

దీని ప్రభావంతో ఎపి లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరించింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో హోర్డింగ్స్, కరెంట్ స్తంభాల వద్ద ఉండవద్దని సూచించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, దీని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఎపి లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ .... అల్పపీడనం ప్రభావంతో ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడురోజులపాటు బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కి.మీ వేగంతో తెలంగాణ రాష్ట్రంలో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti