Dailyhunt
సైన్మా స్టూడియోస్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.1 మూవీ అనౌన్స్‌ మెంట్‌

సైన్మా స్టూడియోస్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.1 మూవీ అనౌన్స్‌ మెంట్‌

హైదరాబాద్ : ప్రముఖ అడ్వకేట్‌ , రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన "సైన్మా స్టూడియోస్‌" బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.

1 చిత్రాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ చిత్రానికి సక్సెస్‌ ఫుల్‌ దర్శక నిర్మాత వేణు ఊడుగుల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పీవీఎన్‌ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్‌ మెంట్‌ తో పాటు పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

ఈ పోస్టర్‌ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో అన్నా చెల్లెలు సైకిల్‌ పై వెళ్తుండటం చూపించారు. ' ప్రకృతి మనకు ఇచ్చిన స్నేహితుడు మన సోదరుడు, కానీ ఆ బంధానికి మధ్యలో అహం అనే అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం' అంటూ పోస్టర్‌ పై రాసిన క్యాప్షన్‌ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్‌ వెల్లడించనున్నారు.

టెక్నికల్‌ టీమ్‌

బ్యానర్‌ - సైన్మా స్టూడియోస్‌
సమర్పణ - వేణు ఊడుగుల
నిర్మాత - డా.నాగేశ్వరరావు పూజారి
పీఆర్‌ఓ - జీఎస్‌ కే మీడియా (సురేష్‌ - శ్రీనివాస్‌)
మార్కెటింగ్‌ : హౌస్‌ ఫుల్‌
రచన, దర్శకత్వం - పీవీఎన్‌ కార్తికేయ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti