Dailyhunt
సమయపాలన పాటించని వైద్యులు..

సమయపాలన పాటించని వైద్యులు..

వైపాలెం ఏరియా వైద్యశాలలో ఇబ్బందులు పడుతున్న రోగులు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం:
యర్రగొండపాలెంలోని ఏరియా వైద్యశాల పర్యవేక్షణ కొరవడింది.

నిత్యం వైద్యశాలకు 180 నుంచి 220 మంది దాకా రోగులు వస్తుంటారు. వారికి ముగ్గురు రెగ్యులర్‌ వైద్యులు చికిత్సలు అందిస్తారు. బుధవారం డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు, గర్భిణులు వైద్య చికిత్స కోసం వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. 12 గంటలు అయినప్పటికీ వైద్యులు రాకపోవడంతో అవస్థలు పడ్డారు. వీరభద్రాపురంనకు చెందిన మరియమ్మ మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు వచ్చి కూర్చున్నామని, ఇప్పటిని వరకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వాపోయారు. మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరి మాట్లాడుతూ గర్భిణీకి స్కానింగ్‌ తీయించాలని వస్తే వైద్యులు అందుబాటులో లేరని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti