Wednesday, 20 Nov, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
సమ్మెపై నేడు నిర్ణయం?

* హైకోర్టు తీర్పుకాపీ పరిశీలిస్తాం : జెఎసి
* కొనసాగించాలంటున్న కార్మికులు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో:
ఆర్‌టిసి సమ్మెపై నేడు నిర్ణయం తీసుకోవాలని జెఎసి నిర్ణయించింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం జెఎసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు తీర్పు కాపీ బుధవారం అందుతుందని, దానిని అధ్యయనం చేసిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని జెఎసి నేతలు తెలిపారు. అంతకుముందు ఆర్‌టిసి సమ్మె వివాదాన్ని కార్మిక న్యాయస్థానానికి అప్పగించాలన్న హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సమ్మె కొనసాగింపుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యచరణపై కార్మిక సంఘాలు టిఎంయు, ఇయు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ తదితర సంఘాలు మంగళవారం వేర్వేరుగా జిల్లా సంఘాల నాయకులతో సమావేశమైనాయి. వారి అభిప్రాయా లను సేకరించాయి. జిల్లాల నుండి వచ్చిన అందరూ దాదాపుగా సమ్మెను కొనసాగించి తీరాలనే అభిప్రాయాన్ని ఈ భేటీల్లో వ్యక్తం చేశారు. భేషరత్తుగా సమ్మెను ఎలా విరమిస్తామని, అసలు నిధులే లేవని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విధుల్లో చేరినా జీతాలు ఇస్తారన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు ఈ సమావేశాల్లో వచ్చాయి.

అనంతరం కార్మికసంఘాల నేతలు జెఎసితో సమావేశమైనారు. విడివిడిగా తాము జరిపిన సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను వివరించిన అనంతరం జెఎసి తీసుకునే నిర్ణయానికి కట్టుబడిఉంటామని తీర్మానం చేశారు. అనంతరం జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి అధ్యక్షతన జరిగిన జెఎసి సమావేశానికి కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ తదితరులు హాజరయ్యారు. జెఎసి సమావేశం అనంతరం అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ..

కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని చెప్పారు. సమ్మెపై నిర్ణయాన్ని కార్మిక సంఘాలు జెఎసికి అప్పగించాయని తెలిపారు. తీర్పు పరిశీలించిన తరువాత త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని, అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. రూట్ల ప్రయివేటీకరణపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్‌టిసి, ప్రయివేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రయివేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తుందా లేదా అనేది తెలియకుండా ఇప్పుడే చట్ట విరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రపంచం గ్లోబలైజేషన్‌, క్యాపిటలైజేషన్‌ కాలంలో ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>