Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరికొత్త ప్రేమకథతో 'క్రష్`

సరికొత్త ప్రేమకథతో 'క్రష్`

రికొత్త ప్రేమకథతో తెరకెక్కనున్న సినిమా 'క్రష్`. హీరో సాయికృష్ణ, కథానాయిక నీలిమ. కథ, దర్శక, నిర్మాత కె.చంద్రశేకర్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఎపి ఫిలిం చాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహనకృష్ణ క్లాప్ కొట్టగా, కార్యదర్శి జె.మోహన్ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు, నిర్మాత విజయ్ వర్మ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ, 'కరోనా తర్వాత పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

దాంతో గుంటూరు వచ్చేశా. గత నాలుగేళ్లుగా మళ్లీ సినిమా రంగంపై దృష్టిసారించా. 'క్రష్` సినిమా యువత కోసం తీస్తున్నాం. హృదయాలు కలిసి యువతీ యువకులు ఇద్దరు ప్రేమించుకుంటారు.

ఆ తర్వాత పెళ్లి వద్దనుకుంటారు. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుందనేది ఇతివృత్తం. కామెడీ, లవ్, యూత్ ఓరియెంటెడ్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చి మెచ్చేలా సినిమాను రూపొందిస్తాం` అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti