ప్రజాశక్తి - పెద్దాపురం : శనివారం పెద్దాపురం పట్టణంలోని చారిత్రాత్మక షాహి జామియా మసీదును రాష్ట్ర వక్బోర్డు డైరెక్టర్ జనాబ్ హాజీ ముకర్రం హుస్సేన్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మసీదు పరిసరాలను పరిశీలించారు. పెద్దాపురం లో ఉన్న వక్బోర్డు ఆస్తుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.ఈ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాహి జామియా మసీదు కమిటీ అధ్యక్షులు ముక్తార్ ఆలీ ఆయన కు దృష్టికి పలు కీలక అంశాల ను తీసుకువెళ్లారు.ముఖ్యంగా ఆదాయం లేని మసీదులకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతులు, వక్భు బోర్డు లో పెండింగ్లో ఉన్న దస్త్రాల పరిష్కారం, వక్బోర్డు ఆస్తుల పరిరక్షణపై తీసుకోవాల్సిన లీగల్ చర్యల గురించి వివరించారు. మసీదు కమిటీ సమర్పించిన వినతులపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలన్నిటిని రాబోయే వక్క్బోర్డు సమావేశం అజెండాలో చర్చించి త్వరిత గతిని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ఆశిక్ ఆలీ, అబిద్ ఆలీ, మైనుద్దీన్,ఇర్షాద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

