Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిబిఎస్ఇ రీ ఇవాల్యుయేషన్ పోర్టల్ పై సైబర్ దాడి

సిబిఎస్ఇ రీ ఇవాల్యుయేషన్ పోర్టల్ పై సైబర్ దాడి

న్యూఢిల్లీ : సిబిఎస్ఇ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ పై సైబర్ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు 50మంది విద్యార్థులు అక్రమంగా లాగిన్ అయినట్లు వెల్లడించారు.

ఈ పోర్టల్ పై అనధికారిక దాడులు జరిగాయని, చెల్లింపుల గేట్ వే హెచ్ డి ఎఫ్ సికి అనుసంధానించబడి ఉందని, సుమారు 50మంది విద్యార్థులు యాక్సిస్ అయ్యారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి పేమెంట్ గేట్‌వే అనుసంధానంలో జరిగిన లోపాల ఆధారంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో పోర్టల్‌లో ఫీజుల తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. సాధారణంగా ఉండాల్సిన రీ-ఇవాల్యుయేషన్ ఫీజులు ఒక్కసారిగా మారిపోయాయని, కొందరికి కేవలం ఒక రూపాయి ఫీజుగా చెల్లించాలని కనిపిస్తే, మరికొందరికి ఏకంగా 68,000 రూపాయలు చెల్లించాలని చూపినట్లు వెల్లడించారు.

ఈ సమస్య కారణంగా 12వ తరగతి జవాబు పత్రాల ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకునే వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం, రీ-ఇవాల్యుయేషన్ మౌలిక సదుపాయాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సమస్యను పరిష్కరించేందుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణుల సహాయాన్ని తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్), నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ప్రత్యామ్నాయ పేమెంట్ గేట్‌వేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti