బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కేబినెట్ రద్దయ్యిందని, ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని లోక్ భవన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తదుపరి సిఎం నియమితులయ్యే వరకు సిద్ధరామయ్య తాత్కాలిక సిఎంగా కొనసాగుతారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న డి.కె.శివకుమార్ తదుపరి సిఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తదుపరి అధ్యక్షుడి విషయాలపై చర్చించేందుకు సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కానున్నారు.
గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య లోక్ భవన్ చేరుకున్నారు. వ్యక్తిగత కారణాల రిత్యా గవర్నర్ ఇండోర్ వెళ్లడంతో.. సిద్ధరామయ్య గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

