Dailyhunt
సిఎ ఫైనల్‌ పరీక్షలు ఇకపై ఏడాదికి రెండు పర్యాయాలే

సిఎ ఫైనల్‌ పరీక్షలు ఇకపై ఏడాదికి రెండు పర్యాయాలే

న్యూఢిల్లీ : చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సిఎ) ఫైనల్‌ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహిస్తామని మంగళవారం చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) మంగళవారం తెలిపింది.

మే లేదా నవంబర్‌ నెలల్లో పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతంలో ఏడాదికి మూడు పర్యాయాలు తుది పరీక్షల నిర్వహణ ఉండేది. సిఎ తుది పరీక్షల నిర్వహణకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ ఈ ఏడాది మే నెల నుండి అమల్లోకి వస్తుందని ఐసిఎఐ తెలిపింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

గతంలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా అర్హత సాధించాలంటే ఏడాదికి మూడుసార్లు-జనవరి, మే, సెప్టెంబర్‌ నెలల్లో నిర్వహించే తుది పరీక్షల్లో విజయం సాధించాల్సి వుండేది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti