Dailyhunt
సిఇఒ క్యాంప్‌బెల్‌ రాజీనామా..

సిఇఒ క్యాంప్‌బెల్‌ రాజీనామా..

ముంబయి : టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సిఇఒ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2027 జూన్‌ వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఏడాది ముందే ఆయన బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం.

ఆయన నాయకత్వంలో విస్తారా విలీనం జరిగినప్పటికీ సేవల నాణ్యతలో లోపాలు, గత ఏడాది జరిగిన అహ్మదాబాద్‌ ప్రమాదం వంటి ఘటనలపై టాటా యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిరిండియా తదుపరి అభివృద్ధి కోసం మరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని విల్సన్‌ పేర్కొనగా.. కొత్త సిఇఒ ఎంపికయ్యే వరకు ఆయన ఆరు నెలల నోటీసు పీరియడ్‌లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త సిఇఒ అన్వేషణ కోసం ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti