Dailyhunt
సోషలిస్ట్‌ క్యూబాని ఆదుకుందాం : సిపిఎం

సోషలిస్ట్‌ క్యూబాని ఆదుకుందాం : సిపిఎం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అమెరికా సామ్రాజ్యవాదం పెట్టె అనేక ఆర్ధిక ఆంక్షలని ఎదుర్కొని కార్మిక వర్గ రాజ్యాన్ని కాపాడుకుంటూ పాలన సాగిస్తున్న క్యూబా కమ్యూనిస్ట్‌ పార్టీ, అక్కడ ప్రజలకి అండగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు.

క్యూబా కి సంఘీభావ దినం సందర్బంగా మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో క్యూబా సంఘీ భావ నిధి వసూళ్లు చేపట్టారు. విజయనగరం పట్టణము లో ఆర్‌ అండ్‌ బి జక్షన్‌ వద్ద జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గని ప్రసంగించారు. క్యూబా పై అమెరికా అష్ట దిగ్బంధనం చేస్తూ ఆర్ధిక ఆంక్షలు విధించి నిర్భందించిందన్నారు. ఆహార పదార్దాలు, పాలు, ఆయిల్‌, మందులు లాంటి కనీస నిత్యావసరాలు కుడా అందకుండా బెదిరించి లంగదీసుకోవాలని ట్రంప్‌ ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

గత 70 ఏళ్లుగా అమెరికా నిర్భందాన్ని ఎదుర్కొంటున్న క్యూబా ప్రభుత్వం, ప్రజలు అమెరికా బెదిరింపులకి లంగ లేదని, కరోనా సమయంలో వేలాది మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రపంచ దేశాలకి వెళ్లి వైద్య సేవలు అందించిన దేశం క్యూబా అన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి, ప్రపంచ ప్రజల ప్రాణాలు కాపాడిన క్యూబా కి ఇప్పుడు అమెరికా నుండి కష్టం వచ్చిందన్నారు. కాబట్టి మనం ఇప్పుడు క్యూబాని ఆదుకోవడం మన బాధ్యత అని శంకరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్‌, నగర కమిటీ సభ్యులు రాము, చినబాబు రమేష్‌ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti