- కోల్ కతా చేతిలో సన్ రైజర్స్ ఓటమి
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. స్వంత మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన సన్ రైజర్స్ వరుసగా ఐదు విజయాల తర్వాత ఈ సీజన్లో మరో ఓటమిని చవిచూసింది.
తొలుత వికెట్ నష్టానికి 105 పరుగులతో పటిష్టంగా ఉన్న సన్ రైజర్స్ కేవలం 60 పరుగులతో వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని కోల్ కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయా సంగా విజయాన్ని అందుకుంది. ఛేదనలో భాగంగా కోల్ కతా ఓపెనర్, కెప్టెన్ రహానే(43)కి తోడు అలెన్(29) బ్యాటింగ్ లో రాణించారు. ఆ తర్వాత రఘువంశీ(59) అర్ధశతకంతో మెరవగా.. రింకు సింగ్(22), గ్రీన్(3) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. ఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్, కమ్మిన్స్, శివాంగ్ కుమార్ తలా వికెట్ సాధించారు. తొలిగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది._ ట్రావెస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మాత్రమే బ్యాటింగ్ లో రాణించారు. వీరిద్దరు ఔటయ్యాక అభిషేక్ శర్మ (15), క్లాసెన్ (11), స్మరణ్ రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2), కమిన్స్ (10), శివాంగ్ కుమార్(1) పరుగుకు ఔటయ్యారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు, నరైన్, కార్తీక్ త్యాగీకి రెండేసి, అనుకుల్ రాయ్, గ్రీన్ కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి దక్కింది.
స్కోర్ బోర్డు…
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ (సి)గ్రీన్ (బి)కార్తీక్ త్యాగీ 15, ట్రివిస్ హెడ్ (సి)గ్రీన్ (బి)వరుణ్ చక్రవర్తి 61, ఇషాన్ కిషన్ (సి)అనుకుల్ రాయ్ (బి)నరైన్ 42, క్లాసెన్ (సి)రువాన్ పావెల్ (బి)గ్రీన్ 11, స్మరణ్ రవిచంద్రన్ (సి)రహానే (బి)వరుణ్ చక్రవర్తి 4, అంకిత్ వర్మ (సి)రహానే (బి)వరుణ్ చక్రవర్తి 6, సలీల్ అరోరా (బి)నరైన్ 2, కమిన్స్ (సి అండ్ బి)అనుకుల్ రాయ్ 10, శివాంగ్ కుమార్ (సి)రఘువంశీ (బి)వైభవ్ అరోరా 1, హర్షల్ పటేల్ (సి) వైభవ్ అరోరా (బి)కార్తీక్ త్యాగీ 6, ఈషన్ మలింగ (నాటౌట్) 2, అదనం 5. (19 ఓవర్లలో ఆలౌట్) 165 పరుగులు. వికెట్ల పతనం: 1/44, 2/105, 3/117, 4/122, 5/135, 6/139, 7/148, 8/156, 9/156, 10/165
బౌలింగ్: నరైన్ 4-0-31-2, వైభవ్ 3-0-25-1, కార్తీక్ త్యాగీ 4-0-30-2, గ్రీన్ 3-0-34-1, వరుణ్ 4-0-34-3, అనుకుల్ 1-0-8-1.
కోల్ కతా నైట్ రైడర్స్: రహానే (సి) రవి చంద్రన్ (బి)షకీబ్ హుసైన్ 43, అలెన్ (సి)క్లాసెన్ (బి)కమిన్స్ 29, రఘువంశీ (సి)ఈషన్ మలింగ (బి)శివాంగ్ కుమార్ 59, రింకు సింగ్ (నాటౌట్) 22, గ్రీన్ (నాటౌట్) 3, అదనం 13. (18.2ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 169 పరుగులు. వికెట్ల పతనం: 1/49, 2/133, 3/151
బౌలింగ్: అభిషేక్ శర్మ 2-0-14-0, కమిన్స్ 4-0-47-1, ఈషన్ మలింగ 3.2-0-42-0, శివాంగ్ కుమార్ 4-0-31-1, హర్షల్ పటేల్ 2-0-17-0, షకీబ్ హుసైన్ 3-0-17-1.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి

