Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Stock Markets - ప్రారంభ లాభాలు ఆవిరి - రూపాయి పతనం

Stock Markets - ప్రారంభ లాభాలు ఆవిరి - రూపాయి పతనం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఒత్తిడిలో ముగిశాయి. ప్రారంభంలో లాభాలతో సాగిన ట్రేడింగ్‌.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ప్రభావంతో దిశ మార్చుకుంది.

ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, మెటల్‌ రంగాల షేర్లలో విక్రయాలు పెరగడంతో సూచీలు దిగజారాయి. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ కూడా బలహీనతను కొనసాగించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 96.61 వద్ద చారిత్రాత్మక కనిష్ఠాన్ని నమోదు చేయగా.. చివరకు 96.52 వద్ద ముగిసింది.

BSE Sensex ఉదయం 75,441.27 వద్ద సానుకూలంగా ప్రారంభమై, ట్రేడింగ్‌ సమయంలో 75,746.27 గరిష్ఠాన్ని తాకింది. అయితే అనంతరం అమ్మకాల ఒత్తిడి పెరగడంతో చివరికి 114.19 పాయింట్లు కోల్పోయి 75,200.85 వద్ద ముగిసింది. ఇదే విధంగా Nifty 50 కూడా 31.95 పాయింట్లు పడిపోయి 23,618 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో Kotak Mahindra Bank, UltraTech Cement, Titan Company, Bharti Airtel, Sun Pharmaceutical Industries షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు Infosys, HCL Technologies, Tech Mahindra, Tata Consultancy Services షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో Brent Crude ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4540 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti