ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి జిల్లా) : నియోజకవర్గంలో అకాల సుడిగాలి బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం నుంచే తీవ్ర వడగాలులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు, రాత్రి ఒక్కసారిగా వీచిన బలమైన సుడిగాలులతో ప్రజలు వాహనదారులు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో జాతీయ రహదారి అనుకోని తణుకు నుండి పెరవలి సబ్ స్టేషన్ కు వచ్చే 33 కె.వి మొయిన్ లైన్ పెరవలి నుండి మల్లేశ్వరం సబ్ స్టేషన్ కు వచ్చే లైన్ పై భారీ వృక్షాలు జాతీయ రహదారి వెంబటి ఉన్న విద్యుత్ లైన్ల మీద పడి పోవటంతో 33 నూతన కరెంటు స్థంభాలు ఒరిగిపోయి లైన్లు తెగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం అకస్మాత్తుగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు, సుడిగాలులు వీస్తున్న సమయంలో పెద్ద వృక్షాల కింద నిలబడకూడదని, చెట్లు ఉన్న మార్గంలో ప్రయాణాలు చేయకూడదని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

