న్యూఢిల్లీ : వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్గావ్‌కర్ తనకు అలాంటి సంఘటన గురించి తెలియదని చెప్పినప్పటికీ.. న్యాయవాదుల నుండి అధికారిక ఫిర్యాదు వచ్చిన తర్వాత, తదుపరి కార్యాచరణ ప్రణాళిక చేపడతామని అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ కార్యదర్శి జోసెఫ్ అరిస్టాటిల్ చెప్పారు. దీనిపై ఎన్‌ఐసి అధికారులను ప్రశ్నించగా..ఈ స్రిప్ట్‌ను అన్ని ఎన్‌ఐసి వేదికలపై వినియోగించామని, అయితే సుప్రీంకోర్టు వేదిక నుండి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కొన్ని గంటల తర్వాత రిజిస్ట్రీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక ఈ మెయిల్స్ నుండి ఈ చిత్రం వెళ్లినట్లు శుక్రవారం గుర్తించామని, దీనికి, న్యాయ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేసింది. ఈ మెయిల్‌లో ప్రకటనల గురించి సీనియర్ అడ్వకేట్ చందర్ ఉదరు సింగ్ మాట్లాడుతూ... అవి అత్యంత అభ్యంతరకరమైనవిగా అభివర్ణించారు. భారత్‌లోని న్యాయ వ్యవస్థలు.. ప్రభుత్వ కార్యాలయాలు కావని, ప్రభుత్వ ప్రచార యంత్రాలుగా వీటిని వినియోగించకూడదని అన్నారు.

