Dailyhunt
సూర్యలంక తీరంలో అభివృద్ధి పనులు వేగవంతం : బాపట్ల ఎంపి తెన్నేటి కృష్ణప్రసాద్‌

సూర్యలంక తీరంలో అభివృద్ధి పనులు వేగవంతం : బాపట్ల ఎంపి తెన్నేటి కృష్ణప్రసాద్‌

బాపట్ల : బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్‌ మంగళవారం సూర్యలంక తీర ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు.

గత మార్చి నెలలో పనులను పర్యవేక్షించిన ఆయన, మొత్తం రూ.97.52 కోట్ల వ్యయంతో సూర్యలంక తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనుల పురోగతిని తెలుసుకునేందుకు మళ్ళీ ఈరోజు సందర్శించారు. నిర్మాణ పనులలో రాజీపడకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని, పర్యాటకులకు అన్ని వసతులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti